క్రైస్తవులు
జరుపుకొనే పండుగలలో ఒక
ముఖ్యమైన పండుగ ఈస్టరు.
యేసు ప్రభువు సిలువ మరణం
పొంది తిరిగి మృతులలొ
నుండి మూడవ దినమున లేచిన
ఆ ప్రత్యేకమైన రోజు ఆదివారము.
ఈ పవిత్రమైన ఆదివారమును
ఈస్టరుగా సర్వ ప్రపంచమంతా
కూడా పండుగ చేసుకొనుచున్నారు.
ఈ పండుగను మీరు మీ బంధు
మిత్ర అభిమానులు జరుపుకొనుచుండగా
దేవుడు మన అందరినీ దీవించాలని
నా ప్రార్థన.
ఈ సందర్భమున
ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని
గురించి మీకు తెలియజేయాలని
ఆశపడుచున్నాను. ఆయన పేరు
సాధు సుందర్ సింఘ్. సాధు
సుందర్ సింఘ్ 1889 సంవత్సరములొ
భారత దెశములొని పంజాబు
రాష్ట్రములొ రాంపూర్
అను గ్రామములొ జన్మించాడు.
ఆయన మంచి జ్ణానవంతుడైయుండెను.
ఎంత తెలివైన వాడంటే 7వ
సంవత్సరము వయస్సులొనే
భగవద్ గీతను క్షుణ్ణంగా
నేర్చుకొని తన 16వ యేటనే
అన్ని ఇతర ప్రముఖ గ్రంథాలు
అనగా ఖురాను, వేదాలు, పురాణాలు
చదవటం ముగించేను. ఇలా
తన జీవితము జరుగుచుండగా,
ఒక రొజున తను చదువుకొనే
స్కూలులొ అతని టీచరు
ఒక బైబిలును (క్రైస్తవుల
పరిశుద్ధ గ్రంధం) సాధు
సుందర్ సింఘ్ నకు బహుమానముగా
ఇస్తే, ఆ గ్రంధమును సుందర్
సింఘ్ తన తండ్రి ముందు
మరియు అందరి ముందూ బహిరంగ
ప్రదేశములొ కాల్చి వెసెను.
అంతే కాదు, దేవుని సేవ
చేసే వాళ్ళ మీద రాళ్ళు
విసరడం కూడా చేసేవాడు.
ఎందుకనగా అతని దృష్టిలో
క్రైస్తవ మతం తననీ తన
దెశ ప్రజలను బాధిస్తున్న
తెల్లవాడి మతం, ఒక విదేశీ
మతం.
ఇలా రోజులు జరుగుచుండగా,
సాధు సుందర్ సింఘ్ నకు
భయంకరమైన శ్రమలు, బాధలు
మరియు సమస్యలు రావటం
ప్రారంభమైనవి. ఇతువంటి
సమయములొనే తన తల్లి కూడ
చనిపొయింది. ఇటువంటి
క్లిష్టమైన పరిస్థితులలొ
అనెకమైన ప్రశ్నలు సుందర్
సింఘ్ నకు కలుగటం ప్రారంభమైనవి.
నిజమైన దేవుడు ఎవరు?
అసలు దేవుడు అంటూ వుంటే
నాకెందుకు ఈ శ్రమలు? అని
వివిధ ప్రశ్నలు అతనిని
సతమతం చేసినవి. కాని తన
ప్రశ్నలకు సమాధానాలు
దొరుకక పూవుటచే, ఒక రొజు
ఉదయాన్నే 3:00 గంటలకు లేచి
ఒక నిర్ణయానికి వచ్చాడు.
దేవుడు అంటూ వుంటే నాకు
ఇప్పుడే ఆయన దర్శనం కలుగాలి,
నాకు మనశ్శాంతి కలుగాలి
అని ఆలొచించటం ప్రారంభించాడు
సుందర్ సింఘ్. సుమారు
రెండు గంటల తరువాత ఉదయం
5:00 గంటల సమయంలో యేసు ప్రభువు
సాధు సుందర్ సింఘ్ నకు
ఒక గొప్ప వెలుగులొ ప్రత్యక్షమయ్యెను.
ఆ ప్రత్యక్షతలో యేసు
ప్రభువు సాధు సుందర్
సింఘ్ కు దర్శనమై మనశ్శాంతిని
పాప విమోచనను కలుగ చెసెను.
యెసు ప్రభువంటే ఎవరు
అనుకొనుచున్నారా? ఈస్టరు
పండుగ ఎందుకు జరుపుకొంటారు?
ఈస్టరు పండుగ ప్రత్యేఖత
ఏమిటి? అని మీరు అనుకొనుచున్నారా?
యేసు ప్రభువు దేవుడు.
నిన్ను, నన్ను, సర్వ ప్రపంచమును
సృష్టించన సృష్టికర్త.
ఆయన ఒక్కడే నిజమైన దేవుడు.
కుంటి వారికి నడకను, గుడ్డి
వారికి దృష్టిని, మూగ
వారికి మాటను, చెవిటి
వారికి వినికిడిని, చనిపొయిన
వారిని సైతము జీవమిచ్చి
లేవనెత్తు శక్తి గల గొప్ప
దెవుడు.
ఈస్టరు సారాంశము
ఎమిటంటే, యేసు ప్రభువు
పాపము లేని మానవునిగా
సుమారు 2000 సంవత్సరాల క్రితము
జన్మించి, 33 1/2 సంవత్సరములు
భూమిపై జీవించి, 3 1/2 సంవత్సరముల
పాటు ప్రజా సేవ చేసి, ప్రజలకు
ప్రేమను పంచిపెట్టి,
కుల, మత, వర్ణ, విచక్షణ లేకుండా
అందరినీ ప్రేమించి, ప్రజల
పాప క్షమాపణ కొరకై మరణించి
మూడవ దినమున మరణమును
జయించి లెచిన పునరుద్ధానుడైన
యేసు క్రీస్తు.
మీరు
అనుకోవచ్చు యేసు ప్రభువు
దెవుడైనప్పుదు ఎందుకు
చనిపోవలసి వచ్చింది?
ఆయన ఎందుకు సిలువ మరణం
పొందవలసి వచ్చింది? బైబిలు
గ్రంథము (రోమా 5:8) ఏమి తెలియ
జేస్తుందంటే, దెవుడు
మన యెడల తన ప్రేమను వెల్లడి
పరచుచున్నాడు. ఎట్లనగా,
మనమింకను పాపులమై యుండగా
క్రీస్తు మన కొరకు చనిపోయెను.
ఒక విషయాన్ని మనము
మరచిపోరాదు. అది ఏమనగా,
మనమందరమూ పాపులమై యున్నాము.
మన పుట్టుక కూడా పాపముతో
ప్రారంభమవుతుంది. మన
పాప విమోచన నిమిత్తమై
యేసు క్రీస్తు మరణించెను.
యేసు క్రీస్తు మానవ రూపాన్ని
ధరించి ఈ భూమిలో ఒక మానవునిగా
జన్మనెత్తిన మహోన్నతుడైన
గొప్ప దెవుడు, సృష్టికర్త.
పాపములో ఉన్న మనలను రక్షించడానికి
యేసు క్రీస్తు సిలువలో
మరణించెను. ఎందుకనగా,
దెవుడు అతి పరిశుద్ధ
దెవుడు. ఆయన ఎంత పరిశుద్దుడంటే
పరలోకములొ ఎల్లప్పుడూ
ఆయన ఆధీనములొ నివసించే
సెరాపులనే దేవదూతలు కూడా
ఆయన మహిమను చూడటానికి
వారి నేత్రములు సరిపోక,
ముఖాలు కప్పుకొని యుంటారు.
బైబిలు గ్రంథము తెలియజేయునది
ఏమనగా, పాపానికి ప్రతిఫలం
మరణం. కాని దేవుడు ఈ ప్రపంచ
ప్రజలను ఎంతగానో ప్రేమించాడు.
కాబట్టి తన ఒక్కగానొక్క
అద్వితీయ కుమారుణ్ణి
ఈ ప్రపంచంలోకి మన కొరకు
ఆ పాప ప్రతిఫలాన్ని, అనగా
మరణాన్ని పొందుటకు పంపించాడు.
కాబట్టి యేసు క్రీస్తు
సిలువలో మరణించెను. మరణించటమే
కాకుండా, మరలా మూడవ దినమున
మరణమును జయించి మృత్యుంజయుడైన
దేవుడు.
మరొక విశయము
నేను మీకు చెప్ప కోరుచున్నాను.
అది ఏమనగ హిందూ వేదాలలో
కూడ, ప్రత్యేకముగా సామ
వేదంలో, ఒక శ్లోకము ఉన్నది.
సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం
అవశ్యకం
తద్
రక్త పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం
దాని అర్థం ఏమనగా, అన్ని
పాపాలకూ రక్తం చిందించనిదే
పాప విమోచన లేదు. యేసు
క్రీస్తు తన రక్తమును
మన పాప విమోచన కొరకై చిందించి
మన అందరికీ పాప క్షమాపణను
అనుగ్రహించెను.
యేసు క్రీస్తు దేవుడు
అయినప్పుడు, ఆయన ఎందుకు
నరునిగా జన్మించెను?
బైబిలు గ్రంథము (యోహాను
3:16) ఏమి తెలియజేయుచున్నదంటే
దేవుడు లొకమును ఎంతో
ప్రెమించెను. ఆయన యందు
విశ్వాసముంచు ప్రతి వాడును
నశింపక నిత్య జీవము పొందునట్లు
ఆయనను అనుగ్రహించెను.
కొంతమంది అనుకోవచ్చు
కదా, ఏమంటే, నాకు పాప క్షమాపణ
ఎలా కలుగుతుంది? నాకు
మనశ్శాంతి కావలి, మోక్షానికి
మార్గం ఎది?
యేసు
ప్రభువు మీ పాపములను
క్షమించును. ఆయనే మనశ్శాంతికి
మరియు మోక్షానికి మార్గము.
మనమందరమూ కూడా ఒక రోజున
చనిపోవాలి. చనిపోయిన
తరువాత, మీ దేహం మాత్రమే
చనిపోవును. మీ యాత్మ మటుకు
నిత్యమూ ఉండును. కాబట్టి
మీ నిత్య జీవితాన్ని
ఎక్కడ గడపాలని అనుకొనుచున్నారు?
బైబిలు గ్రంథము (యోహాను
14:6) తెలియజేయుచున్నది ఏమనగా,
"యేసే మార్గము సత్యము
మరియు జీవము". మరియు (యోహాను
3:17,18) "లోకము తన కుమారుని
ద్వారా రక్షణ పొందుటకేగాని
లోకమును తీర్పు తీర్చుటకు
దేవుడాయనను లొకములోనికి
పంపలేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి
తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు
దేవుని అద్వితీయ కుమారుని
నామమందు విశ్వాసముంచలేదు
గనుక వానికి ఇంతకు మునుపే
తీర్పు తీర్చబడెను" మరియు
(అపోస్తలుల కార్యములు
4:12) "ఎవరి వలననూ రక్షణ కలుగదు;
ఈ నామముననే (అనగా యేసుని
నామము) మనము రక్షణ పొందవలెను
గాని ఆకాశము క్రింద మనుష్యులలో
ఇయ్యబడిన మరి ఏ నామమున
రక్షణ పొందలేము అనెను".
యేసు ప్రభువును నమ్ముకొని
పాప క్షమాపణ పొందిన యెడల
ఆయన మనకు మోక్ష మార్గమును
అనుగ్రహించును. ప్రభువైన
యేసు క్రీస్తు మిమ్ములను
మీ కుటుంబాలను మరియు
సర్వ ప్రపంచమును కాపాడి,
రక్షించి మరియు దీవించి,
మనశ్శాంతిని, పాప క్షమాపణను
మరియు మోక్ష మార్గమునూ
కలుగ జేయును గాక! ఆమేన్!
[పాస్టర్ శాస్త్రి
మీసాల: ఈ శుభ సందేశమును
104.9 ఎఫ్.ఎమ్ సలామ్ నమస్తే
రేడియో స్టేషన్ లో ఏప్రిల్
12, 2009 ఈస్టరు ఆదివారము ఉదయమున
శ్రోతులకు అందించటం జరిగింది].